- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడారంలో చుక్కలు చూపిస్తున్న ధరలు మటన్ రూ.1500, చికెన్ ఎంతంటే?
by Ajay Maddhiboyina |
మేడారం జాతరలో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇది అది అని తేడా లేకుండా ఏది కొనాలన్నా భక్తులు బయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

X
దిశ, వెబ్ డెస్క్: మేడారం జాతరలో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇది అది అని తేడా లేకుండా ఏది కొనాలన్నా భక్తులు బయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బయట కేజీ మటన్ ధర రూ.900 నుండి రూ.1000 మధ్య ఉండగా మేడారంలో రూ.1500లకు కేజీ అమ్ముతున్నారు. లైవ్ కోడి బయట రూ.170 ఉండగా మేడారంలో రూ.350 ఆ పైనే అమ్ముతున్నారు. అంతే కాకుండా మద్యం ధరలను సైతం భారీగా పెంచి అమ్ముతున్నారు. బీర్ బయట రూ.180 ఉండగా మేడారంలో రూ.280 నుండి రూ.300లకు అమ్ముతున్నారు. ఇతర మధ్యం బాటిళ్లపైనా రూ.100 ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇక ఉండగటానికి నీడ కోసం కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చెట్టు కింద నివసించేందుకు సైతం రూ.1000 నుండి రూ.2000 అద్దెలు వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






