ఈహెచ్‌సీటీ అమలు కానేలేదు

by velandi.Saikiran |

రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు సి. జగదీశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈహెచ్‌సీటీ అమలు కానేలేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎంప్లాయ్ హెల్త్ స్కీం అమలుపై స్పష్టమైన విధివిధానాలు ఖరారు కాకముందే, అధికారుల అత్యుత్సాహంతో జీతాల నుండి సబ్‌స్క్రిప్షన్ మినహాయింపులు చేపట్టడంపై రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు (ఆర్ యూపీపీ టీఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి అధికారిక ప్రకటన లేదా జీవో లేకుండానే ఏకపక్షంగా ఉద్యోగుల వేతనాల నుండి 1.5 శాతం బేసిక్ పే కట్ చేసి ఐఎఫ్ఎంఐఎస్ సైట్‌లో పెట్టడంపై సంఘం నేతలు మండిపడ్డారు.

ఈ మేరకు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు సి. జగదీశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శంకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 2 నుండి ఈహెచ్‌సీటీ అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, దానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు, నెట్‌వర్క్ హాస్పిటల్స్ వివరాలు, రోగాల కవరేజ్ వంటి కీలక అంశాలు ఇంకా తేలనేలేదని వారు గుర్తుచేశారు. జూన్ నెలలో ఈహెచ్‌సీటీకి సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేసి, ఉద్యోగ ఉపాధ్యాయులందరి ఆమోదంతో, పూర్తి విధివిధానాలను ఖరారు చేసిన తర్వాతే కంట్రిబ్యూషన్లు తీసుకోవాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

Next Story