- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సీక్రెట్ హీరోతో విదేశానికి చెక్కేసిన రష్మిక.. అక్కడే సెలెబ్రేషన్స్
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసుకుంది. అందులో గల్ఫ్ దేశాలలో ఒకటైన ఒమన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్.. ఇవాళ తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకలకు నేషనల్ క్రష్ ఫ్రెండ్స్‌తో పాటు ఆ స్టార్ హీరో కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. ఆ సీక్రెట్ హీరో ఎవరో ఈ లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి.
హైదరాబాద్ పరిధిలోని మందుబాబులకు పోలీసులు షాకిచ్చారు. రేపు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని మొత్తం వైన్ షాపులు మూతపడున్నాయి. ఈ మేరకు ఈ నెల 6న వైన్ షాపులు బంద్ చేయాలంటూ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ తిరిగి ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశంలోని కోట్లాది మంది హక్కులను కాలరాసే వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌గాంధీ మాట్లాడకపోవడం దారుణమని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా తిరుగుతున్న రాహుల్.. మైనారిటీల హక్కులను కాలరాసే వక్ఫ్ బిల్లుపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పై విరుచుకుపడిన ఆమె హాట్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలను ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
కొంతకాలంగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు మెల్లగా దిగి వస్తున్నాయి. ఈ నెల 1న రూ.94వేల ఆల్ టైమ్ రికార్డుకు చేరిన తులం పసిడి ధరలు క్రమంగా తగ్గుతూ సామాన్యులకు ఊరట ఇస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి ట్రెండింగ్ ముగిసే సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.2,400 తగ్గి రూ.91,640గా ఉంది. వెండి ఇవాళ 5 వేలు రూపాయలు తగ్గింది. నిన్న, ఈ రోజు ఎంతమేర తగ్గాయో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు, తయారీలో అవకతవకల కేసులో ఆ పార్టీ కీలక ఎంపీ అరెస్టుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. ఈ కుంభకోణంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) ఆరోపించిన సంగతి తెలిసిందే. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని డిస్టిలరీలు నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేసి, ప్రభుత్వ ఛానెళ్ల ద్వారా అధిక ధరలకు విక్రయించాయని ఆరోపణలు ఉన్నాయి. ఇంతకూ ఏ కేసులో ఏం జరిగిందో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






