- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రిటికల్ మినరల్స్‌లో వ్యూహాత్మక స్వయంప్రతి
ప్రపంచ సరఫరా గొలుసులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి, క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాల) రంగంలో భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి సాధించే దిశగా కీలక అడుగు పడింది.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ సరఫరా గొలుసులో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి, క్రిటికల్ మినరల్స్ (కీలక ఖనిజాల) రంగంలో భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి సాధించే దిశగా కీలక అడుగు పడింది. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్సీఐ)లో ఏర్పాటు చేసిన రేర్ ఎర్త్ పర్మినెంట్ మ్యాగ్నెట్స్ ఎన్డీ-ఎఫ్ఈ-బీ (నియోడైమియం-ఐరన్-బోరాన్) పైలట్ ప్లాంట్‌ను కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో ముడి మిశ్రమ ధాతువుల నుంచి పూర్తి స్థాయి అయస్కాంతాల వరకు స్వదేశీ సాంకేతికతతోనే తయారు చేస్తారని అభయ్ కరాండికర్ తెలిపారు. ప్రస్తుతం రేర్ ఎర్త్ మాగ్నెట్ సరఫరా కేవలం కొన్ని దేశాల వద్దే కేంద్రీకృతమై ఉందని... ఈ ప్లాంట్ ద్వారా ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుందన్నారు.
ఈవీ రంగంతో పాటు అధునాతన తయారీ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను ఈ ప్లాంట్ భర్తీ చేస్తుందన్నారు. డీప్-టెక్ స్టార్టప్‌లు, ప్రైవేట్ సంస్థలు ఈ వేదికను వినియోగించుకుని వికసిత్ భారత్-2047 లక్ష్యానికి తోడ్పడాలని కరాండికర్ పిలుపునిచ్చారు. ఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్. విజయ్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో శాస్త్ర, సాంకేతిక విభాగం మాజీ కార్యదర్శి, ఏఆర్‌సీఐ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ అశుతోష్ శర్మ, మిధాని, మాజీ సీఎండీ, టెక్నికల్ రివ్యూ కమిటీ మెంబర్ డాక్టర్ ఎస్.కె.ఝా, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్(ఏఎన్ఆర్ఎఫ్) సీఈఓ డాక్టర్ శివకుమార్ కళ్యాణరామన్‌తో పాటు వివిధ పరిశ్రమలు, జాతీయ సంస్థల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.






