- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ వర్షిణి మిస్సింగ్..రేప్ కేసు నమోదు..అఘోరీ బతుకు ఆగమాగం
లేడీ అఘోరీ అలియాస్ అఘోరీ శ్రీనివాస్ జీవితంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. సనాతన ధర్మం పేరు చెప్పుకుని తెలుగు రాష్ట్రాలలో హల్‌చల్ చేసిన శ్రీనివాస్ ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: లేడీ అఘోరీ అలియాస్ అఘోరీ శ్రీనివాస్ జీవితంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. సనాతన ధర్మం పేరు చెప్పుకుని తెలుగు రాష్ట్రాలలో హల్‌చల్ చేసిన శ్రీనివాస్ ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నాడు. తాను లేడీ అఘోరీ అని సనాతన ధర్మ పరిరక్షణ కోసమే ప్రజల్లోకి వచ్చానని శ్రీనివాస్ చెప్పుకున్నాడు. తెలుగు రాష్ట్రాలలోని పలు ఆలయాలను సందర్శిస్తూ వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచాడు. కానీ తరవాత అతడు మహిళ కాదు ట్రాన్స్‌జెండర్ అని తేలింది. మరోవైపు బూతులు తిట్టడం పోలీసులపైనే దాడి చేయడంతో అతడు ఫేక్ అఘోరీ అని అందరికీ అర్థం అయ్యింది. చివరికి ఓ మహిళను డబ్బులు తీసుకుని మోసం చేయడంతో అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించారు.
ఆ తరవాత కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ తనను శ్రీనివాస్ పెళ్లి చేసుకుని మోసం చేశాడని రేప్ కేసు నమోదు చేసింది. దీంతో శ్రీనివాస్ గత 45 రోజులుగా జైలులోనే ఉన్నాడు. నేడు ఆ కేసుపై కరీంనగర్ కోర్టు విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు అఘోరీని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. నేరుగా అఘోరీని కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని జడ్జి పోలీసులను ప్రశ్నించారు. నేరుగా కోర్టులో ప్రవేశపెడితే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని పోలీసులు న్యాయమూర్తికి వివరించారు. అఘోరీ తరుపున వాదించేందుకు లాయర్ లేకపోవడాన్ని కూడా కోర్టు ప్రశ్నించింది. దీంతో తనకు అంత స్థోమత లేదని శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకున్నట్టు సమాచారం.
ఇక శ్రీనివాస్ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి వర్షిణిని మరో పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు చెప్పింది. తన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే మహిళలను పెళ్లి చేసుకోవడం, మోసం చేయడం లాంటివి చేస్తున్నాడని ఆరోపించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అఘోరీని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీ వర్షిణి కనిపించకుండా పోయింది. వర్షిణి గత 45రోజులుగా గచ్చిబౌలిలోని ఓ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స తీసుకుంటోంది. కాగా నిన్న ఆమె రిహాబిలిటేషన్ నుండి రిలీజ్ అవ్వగా కనిపించకుండా పోయింది. విజయవాడలోని వర్షిణి ఇంటికి కూడా తాళం వేసి ఉండటంతో ఆమె ఎటు పోయిందా అన్న అనుమానామాలు మొదలయ్యాయి.






