- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పనితీరు ఆధారంగా అధికారులకు ర్యాంకులు : ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్‌రావు
రాష్ట్రంలో మాదకద్రవ్యాల, అక్రమ మద్యం రవాణా, నాటు సారా తయారీని అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ పనితీరు మెరుగుపడాలని రెవెన్యూ శాఖ సి.టి, ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మాదకద్రవ్యాల, అక్రమ మద్యం రవాణా, నాటు సారా తయారీని అరికట్టడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ పనితీరు మెరుగుపడాలని రెవెన్యూ శాఖ సి.టి, ఎక్సైజ్ కార్యదర్శి రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ నేరాలపై నిఘా పెంచి, అక్రమాలకు అడ్డుకట్ట వేసినప్పుడే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. గురువారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరి కిరణ్‌తో కలిసి ఆయన జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనితీరు ఆధారంగా అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు సరికొత్త విధానాన్ని అమలు చేయబోతున్నట్లు రఘునందన్‌రావు వెల్లడించారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా, డివిజన్ స్థాయిలో అధికారుల పని తీరును సమీక్షించి, వారికి ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. క్రైమ్ కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఎందుకు విఫలమవుతున్నాం, అనే అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడే ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి అని ఆయన పేర్కొన్నారు.
మద్యం అమ్మకాలతో పాటు నేర నియంత్రణలో ప్రతి అధికారి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. శాఖలో పనిచేసే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కార్యదర్శి భరోసా ఇచ్చారు. సిబ్బందికి సంబంధించిన పదోన్నతులు, మెడికల్ బిల్లుల చెల్లింపులు, ఖాళీల భర్తీ వంటి అంశాలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పాటు ప్రజారోగ్యానికి హాని కలిగించే కల్తీ మద్యం, నాటు సారా రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దగలమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాసీన్ ఖురేషి, ఎక్సైజ్ అకాడమీ డైరెక్టర్ సురేష్ రాథోడ్, జాయింట్ కమిషనర్లు అంజన్‌రావు ఎన్‌ఫోర్స్‌మెంట్, డేవిడ్ రవికాంత్, జిల్లాల డిప్యూటీ కమిషనర్లు పి.దశరథ్, అనిల్ కుమార్ రెడ్డి, జె.హరికిషన్, జనార్థన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రఘురాం, విజయ భాస్కర్‌రెడ్డి,అన్ని జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ కమిషనర్లు హాజరయ్యారు.






