మాటిచ్చారు.. ఇప్పుడు తప్పొద్దు

by Elthuri vijay kumar |

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫార్మాసిటీకి పట్టా భూములను తీసుకోమని రైతులకే తిరిగి ఇస్తామని మాటిచ్చారని ఇప్పుడు తప్పొద్దని ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.

మాటిచ్చారు.. ఇప్పుడు తప్పొద్దు
X

మాటిచ్చారు.. ఇప్పుడు తప్పొద్దు

ఫార్మాసిటీ రైతులకు న్యాయం చేయాలి

ఆర్డర్ కాపీలను అథారిటీ కోర్టులో ఇచ్చాం

జిల్లా కలెక్టర్ సమావేశంలో రైతుల సృష్టీకరణ

ప్రభుత్వంతో చర్చించి 10 రోజుల్లో స్పష్టత ఇస్తాం : కలెక్టర్ నారాయణ రెడ్డి

దిశ, యాచారం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫార్మాసిటీకి పట్టా భూములను తీసుకోమని రైతులకే తిరిగి ఇస్తామని మాటిచ్చారని ఇప్పుడు తప్పొద్దని ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీవో అనంతరెడ్డి, మండల పరిధిలోని నానక్ నగర్, మేడిపల్లి, తాటిపర్తి, కుర్మీద్ద, 4 గ్రామాల రైతులతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. 2500 ఎకరాల పట్టా భూములపై ఇప్పటికే రద్దు చేసిన ఆర్డర్ స్టే కాపీలను అథారిటీ కోర్టులో అందజేసినట్లు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటి ఆర్డీవో వెంకటాచారి, సిసి 1611/2021 కేసులో చేసిన పొరపాటు వల్ల రాత్రికి రాత్రే రైతుల పేర్లను తొలగించి టీఎస్ ఐఐసి పేరుమీద మార్చేసి నిషేధిత జాబితాలో చేర్చడంతో అప్పటినుండి ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు రైతులకు అందడం లేదని తమ పోరాటంలో ఇప్పటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి, పాల్గొని మా ప్రభుత్వం వస్తే రైతులకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారని హైకోర్టు రద్దు చేసిన అవార్డు కాపులను స్టేకాపీలను కలెక్టర్ కు ఫార్మాసిటీ రైతులు అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి, మాట్లాడుతూ.. ఫార్మసిటీ రైతుల విషయంపై ప్రభుత్వంతో మాట్లాడి పది రోజులలో దీనిపై సమాధానం చెబుతామని తెలిపారు. రైతులకు న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులు కవుల సరస్వతి, మహిపాల్ రెడ్డి, కానమోని గణేష్, సామ నిరంజన్, వినోద్ రెడ్డి, బందే రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story