- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > అధ్వాన్నంగా ఇందిరమ్మ క్యాంటిన్ : మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్
అధ్వాన్నంగా ఇందిరమ్మ క్యాంటిన్ : మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్
by Ratna Kumari |
ఇందిరమ్మ క్యాంటిన్ అధ్వాన్నంగా తయారైందని మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తెలిపారు.

X
దిశ, కూకట్ పల్లి : ఇందిరమ్మ క్యాంటిన్ అధ్వాన్నంగా తయారైందని మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన మూసాపేట డివిజన్ పరిధిలోని గూడ్ షెడ్ రోడ్డులో ఉన్న ఇందిరమ్మ క్యాంటిన్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ ఇందిరమ్మ క్యాంటిన్ చెత్త కుప్ప సమీపంలో అధ్వాన్నంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కనీసం పరిశుభ్రత పాటించకుండా ఆహారాన్ని వడ్డించడం పేద ప్రజల జీవితాల్లో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేద ప్రజలకు రూ.5 కే భోజనం అందించేందుకు ఏర్పాటు చేసిన ఇందిరమ్మ క్యాంటిన్ అధికారుల పర్యవేక్షణ లేక చెత్త కుప్పల మధ్య ఏర్పాటు చేస్తున్నారని, పేదల సంక్షేమం పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఈ క్యాంటీన్ దుస్థితే నిదర్శనమని విమర్శించారు. అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి క్యాంటీన్‌కు షెడ్ వేయించి పరిసరాలను నిత్యం శుభ్రం చేయించాలని, పేదలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తూము శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ జిల్లా గోపాల్, నర్సింహా, అక్బర్, గోపి తదితరులు పాల్గొన్నారు.
Next Story






