- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు.. 111 జీఓ బేఖాతరు
మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరందుకుంటున్నాయి.

దిశ, మొయినాబాద్ : మొయినాబాద్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరందుకుంటున్నాయి. అయినా మున్సిపల్ అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 111 జీవో లెక్కచేయని అక్రమ నిర్మాణదారులు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని, 111 జీవో పరిధిలో అధికారులను లెక్కచేయకుండా ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణదారులు ఇక్కడ అంతా తమ ఇష్టం అన్నట్టుగానే వ్యవహరిస్తూ నిర్మాణాలు చేపడుతున్నారనే టాక్ వినబడుతుంది. ఇలాంటి నిర్మాణాల విషయంలో అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత పురపాలక సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. అక్రమ నిర్మాణాలు చేపట్టి వాటిపై అనుమతి లేకుండా భవనాలను నిర్మించడంతో ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికారులు అటువైపుగా చూడకపోవడం శోచనీయమని ఆరోపిస్తున్నారు.
నూతన కమిషనర్‌కు సమస్యలతో స్వాగతం..
ఇటీవలే మొయినాబాద్ మున్సిపాలిటీ కమిషనర్‌గా ఉన్న ఖాజా మొయిజుద్దీన్ బదిలీ అవ్వగా మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జాకీర్ అహ్మద్‌కు మొయినాబాద్ మున్సిపాలిటీలో సమస్యలతో స్వాగతం పలుకుతున్నామని స్థానిక ప్రజలు తెలిపారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 111జీవో పరిధిలో అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
సెంట్రింగ్ పని చేస్తూ కార్మికుడు మృతి..
మొయినాబాద్‌లో సెంట్రింగ్ పనులు చేస్తుండగా కార్మికుడు భవనం పైనుంచి కింద పడి గాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి ప్రాంతానికి చెందిన అంజి బతుకుదెరువు కోసం మొయినాబాద్ ప్రాంతానికి వలస వచ్చారు. అంజీ సెంట్రింగ్ పనికి వెళ్తుండేవాడు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూ పరిధిలోని 148, 149 సర్వేనెంబర్, వెంకటేశ్వరకాలనీలోని ఓ భవనానికి సెంట్రింగ్ కొడుతున్న సమయంలో ప్రమాదశత్తు కిందపడి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆసుపత్రి ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చారని, కానీ తన భర్త చికిత్స పొందుతూ ఈనెల 7న మృతి చెందాడని మృతుడి భార్య తెలిపారు. ఓ కార్మికుడు మృతి చెందిన కూడా యజమాని పనులు ఆపకుండా 111 జీవోను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నాడని, అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాత్రివేళ జోరుగా నిర్మాణ పనులు..
హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని 148, 149 సర్వేనెంబర్‌లోని వెంకటేశ్వర కాలనీలో ఓ నిర్మాణదారుడు 111జీవోకు విరుద్ధంగా రాత్రివేళ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై జారీచేసిన జీవో 111ను ఉల్లంఘిస్తూ భద్రతా చర్యలు లేకుండా భవన నిర్మాణం జరుగుతుందని, ఇటీవలే ఒక కార్మికుడు భవనం నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడని పలు పత్రికల్లో వచ్చిన పట్టించుకోని అధికారులు మళ్లీ శనివారం అర్ధరాత్రి సమయంలో ఎటువంటి భద్రత లేకుండా 4వ అంతస్తు స్లాబ్ పనులు చేపడుతున్నాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు అధికారులను కోరారు.
రోడ్డును అక్రమించి డ్రైనేజీ గుంత..
హిమాయత్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 63, 64 నెంబర్‌లోని శ్రీనివాస వెంచర్‌లో ఓ ఇంటి యజమాని రోడ్డును ఆక్రమించి డ్రైనేజీ పనులు సాగిస్తున్నాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి రోడ్డును అక్రమించి డ్రైనేజీ పనులు సాగిస్తున్న ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.






