- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈగల్ కంపెనీలో కార్మికుల ఆందోళన
షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామ సమీపంలో ఉన్న ఈగల్ బోర్డ్స్ అండ్ పానల్ ప్రొడక్ట్స్ కంపెనీ, ఈగల్ బయోమాస్ ఎనర్జీ కంపెనీల యజమానులు కార్మికులకు వేతనాలు చెల్లించలేదని కంపెనీ ముందు ఆందోళనకు దిగారు.

దిశ, షాబాద్ : షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామ సమీపంలో ఉన్న ఈగల్ బోర్డ్స్ అండ్ పానల్ ప్రొడక్ట్స్ కంపెనీ, ఈగల్ బయోమాస్ ఎనర్జీ కంపెనీల యజమానులు కార్మికులకు వేతనాలు చెల్లించలేదని కంపెనీ ముందు ఆందోళనకు దిగారు. గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, గత కొంత కాలంగా ముడి సరుకు సప్లై చేసిన వారికి డబ్బులు ఇవ్వలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో కాంప్లెట్ ఇచ్చినా కానీ మా సమస్య పరిష్కారం కావడం లేదని కార్మికులు, ముడి సరుకు దారులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కంపెనీ వద్దకు చేరుకొని కార్మికులను సముదాయించి యజమానులతో చర్చించుకోవాలని సూచించారు. అనంతరం కంపెనీలో అవకతవకలు ఉన్నాయని తెలుసుకొని షాబాద్ మండల వ్యవసాయ అధికారి, ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్ విజయచంద్ర షాబాద్ ఎస్సై శంకర్ రెడ్డి తో కలిసి కంపెనీని సందర్శించి టెక్నికల్ గ్రేడ్ యూరియా 200 బస్తాలను, ఎటువంటి పేరు లేకుండా ఉన్నటువంటి 50 బస్తాలను గుర్తించారు. వాటిని పరీక్షల నిమిత్తం పంపించి అవి పరిశ్రమలకు వాడే యూరియా నా లేక వ్యవసాయానికి వాడు యూరియా నా అని పరిశీలించిన అనంతరం వ్యవసాయానికి వాడే యూరియా అని తేలితే 420 కేసు బుక్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని మీడియాకు తెలిపారు.
ఈగల్ బయోమాస్ కంపెనీ అక్రమ నిర్మాణం
ఈగల్ బయోమాస్ కంపెనీ అక్రమ నిర్మాణాన్ని చేపట్టింది. కంపెనీ ప్రహరీ గోడ వెనుక భాగంలో వాగుపై కంపెనీలో పనిచేసే కార్మికులు ఉండడానికి గదులను నిర్మించారు. అంతేకాకుండా వాగుపై బోరు మోటర్ ను వేయించారు.గ్రామ పంచాయతీ నుండి ఇప్పటివరకు ఎటువంటి పర్మిషన్ పొందలేదని, కంపెనీ వారి దగ్గర ఉన్న పర్మిషన్ లెటర్ లు ఏమైనా ఉంటే గ్రామపంచాయతీకి చూపించాలని సంబంధిత పంచాయతీ కార్యదర్శి అడిగినా కానీ కంపెనీ యాజమాన్యం వారు స్పందించలేదని సమాచారం. దీనిపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.






