- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్మికుల కారాగారం! కొత్తూరు ఫ్యాక్టరీల్లో సేఫ్టీ లేకుండా పనులు
రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండల కేంద్రం పరిసరాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు దక్కించుకుంది. వందలాది పరిశ్రమలు, ముఖ్యంగా ఔషధ, రసాయన, ఆహార, ఇంజినీరింగ్, టెక్స్ టైల్స్, రంగాలకు చెందిన సంస్థల కు ఇది నెలవు.

దిశ, కొత్తూర్: రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండల కేంద్రం పరిసరాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా గుర్తింపు దక్కించుకుంది. వందలాది పరిశ్రమలు, ముఖ్యంగా ఔషధ, రసాయన, ఆహార, ఇంజినీరింగ్, టెక్స్ టైల్స్, రంగాలకు చెందిన సంస్థల కు ఇది నెలవు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వే లాది మంది కార్మికులకు ఈ ప్రాం తం ఉపాధి కల్పిస్తోంది. కానీ తమ స్వగ్రామాలను, కుటుంబాలను వది లి, మెరుగైన భవిష్యత్తుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఈ కార్మికుల జీ వితాలు, ప్రస్తుతం ‘గాలిలో దీపా లుగా’ మారాయి. పరిశ్రమల యా జమాన్యాల నిర్లక్ష్యం, సరైన భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగు తూ, అమాయక కార్మికుల ప్రాణా లు గాల్లో కలిసిపోతునే ఉన్నాయి.
దుర్భర పరిస్థితులు..
ఇక్కడ కార్మికులకు కనీస వసతు లు, భద్రతా పరికరాలు కొరవడడం తో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశాల్లో సరై న వెంటిలేషన్ లేకపోవడం, రసా యన పరిశ్రమల్లో తగిన రక్షణ క వచాలు అందించకపోవడం, పాతబడిన యంత్రాలతో పని చేయించ డం వంటి సమస్యలు సర్వసాధారణంగా మారాయి. కార్మిక సంఘా ల ప్రాతినిధ్యం బలహీనంగా ఉండ డం, భయంతో కార్మికులు సంఘ టితం కాలేకపోవడం యాజమాన్యాల నిర్లక్ష్యానికి కారణం.
అధికారుల నిర్లక్ష్యం..?
పరిశ్రమల్లోని భద్రతా ప్రమాణాల ను పర్యవేక్షించాల్సిన కార్మిక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వం టి ప్రభుత్వ విభాగాలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదనే ఆరోపణలున్నాయి. కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే నామమాత్రంగా తనిఖీలు నిర్వ హించి, ఆ తర్వాత నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు పరిశ్రమల యాజమాన్యా లు, ప్రభుత్వ అధికారులు,స్థానిక నేతల మధ్య అదృశ్య ఒప్పందాలు ఉన్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
భద్రతలేని ప్రాణాలు.. గాలిలో దీపాలు..
నేను బిహార్ నుంచి వచ్చాను. మా కుటుంబం నాపై ఆధారపడి ఉంది. నాలాంటి వాళ్ల వల్ల యా జమాన్యాలు లాభపడుతున్నా యి. అయినా కనీసం మా ప్రా ణాలకు భద్రత లేక పోతే ఎలా? కంటికి కనిపించని రసాయనాల తో, పాత యంత్రాలతో రోజు గ డపడం నరకప్రాయం గా ఉంది. అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఒక పేరు మోసిన ఒక ఔషధ కంపెనీలో ఒక యువకుడు ప్రా ణాలు కోల్పోయాడు. కొత్తూర్ శి వారులోని ఇనుప పరిశ్రమలో జరిగిన ఘటనలో తండ్రి కళ్ల ముందే ప్రమాదానికి గురై ప్రా ణాలు విడిచాడు. బిహార్ కు చెందిన కుష్ కుమార్ జీ వనోపాధికి వచ్చి తండా సమీపంలోని ఒక పాలిమర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. 13వ తేదీ తెల్లవారుజామున మోటారు ఆన్ చే యడానికి వెళ్లి కరెంట్ షాక్ త గిలి మృతి చెందాడు. ఈ ఘటన సోషల్ మీడి యాలో వైరల్ అ య్యింది. ఇలా చెప్పుకుంటూ పో తే, అనేక ప్రమాదాలు జరిగా యి. చాలా వరకు సేఫ్టీ ప్రోటోకా ల్స్ లేకపోవడమే అంటూ విశ్లేషకులు చెప్తు న్నారు.






