మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

by Naveena |

మహిళలు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
X

దిశ, ఆమనగల్లు : మహిళలు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శనివారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను సన్మానించారు. అనంతరం జయపాల్ యాదవ్ మాట్లాడుతూ ..మహిళల తాగు నీటి కష్టాలను దూరం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ అమలు చేసారని, మహిళల రక్షణ కోసం షీ టీంలు ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, ఆమనగల్లు మార్కెట్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షులు పత్య నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్,మాజీ కౌన్సిలర్ రాధా, నాయకులు విమలమ్మ, మంగమ్మ, జ్యోతి,రఘు, వెంకటేష్, యాదయ్య, సతీష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

Next Story