రన్నింగ్ కారులోంచి దూకిన మహిళ..

by Kodari Anjali |

భర్త కారు నడుపుతుండగా భార్య కారులో నుంచి దూకి ఆత్మ హత్యకు పాల్పడింది.

రన్నింగ్ కారులోంచి దూకిన మహిళ..
X

దిశ, పరిగి: భర్త కారు నడుపుతుండగా భార్య కారులో నుంచి దూకి ఆత్మ హత్యకు పాల్పడింది. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూరు గ్రామానికి చెందిన రాజు సోనా భార్యాభర్తలు. వీరికి పెళ్లై ఐదేళ్లు అవుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజు హైదరాబాద్‌లోని కిస్మత్‌పూర్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. భార్యను మద్దూరులో దించేందుకు ఆదివారం రాజు తన భార్య పిల్లలతో కలిసి బయలుదేరాడు. కారులో కూడా గొడవ పడుతూ పరిగి మండలం గడిసింగాపూర్ వద్దకు వచ్చారు. ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతూ హైవే 163 పై గడిసింగాపూర్ వద్ద నడుస్తున్న కారులోంచి భార్య దూకేసింది. దీంతో తీవ్ర గాయాలైన సోనీ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Next Story