ఆర్పీల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా : మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

by Ratna Kumari |

ఆర్పీల సమస్యలు పరిష్కరించేందుకు త్వరిత గతిన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

ఆర్పీల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా :  మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి
X

దిశ, మీర్ పేట్ : ఆర్పీల సమస్యలు పరిష్కరించేందుకు త్వరిత గతిన చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్ పేట్ సర్కిల్ కార్యాలయంలో ఆర్పీల సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆర్పీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... ఆర్పీల సమస్యలపై పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు. అభయ హస్తం నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారం చూపిస్తానని తెలిపారు. అంతకు ముందు ఆర్పీలు మాట్లాడుతూ.. గత ఐదు నెలలుగా తమకు జీతాలు అందడం లేదని, సర్వే నిర్వహించినందుకు రావాల్సిన పారితోషికం కూడా ఇప్పటివరకు చెల్లించలేదని వాపోయారు. ఐదు లక్షల రూపాయలు మంజూరైనప్పటికీ ఒక్క రూపాయి కూడా అందలేదనివారు తెలిపారు.

మైక్రో క్రెడిట్ ప్లాన్ (MCP) యాప్‌ను తరచూ మార్చడం వల్ల లోన్లు సకాలంలో అందించడం కష్టమవుతోందని చెప్పారు. అభయ హస్తం ద్వారా రావాల్సిన నిధులు కూడా ఆలస్యంగా అందుతున్నాయని, దీనివల్ల ప్రజలు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే పావలా వడ్డీ రుణాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, గడిచిన ఐదు నెలలుగా ఎలాంటి రుణాలు ప్రజలకు అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం ద్వారా అందాల్సిన వడ్డీలేని రుణాలు కూడా అందడం లేదని ఆర్పీలు పేర్కొన్నారు. దీంతో ప్రజలు తమనే ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే శ్రీనిధికి సంబంధించిన సమస్యలను కూడా ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, డిపిఓ అశ్విని, యూనియన్ నాయకురాలు మంజుల, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

Next Story