- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంట్లోకి దూరిన పాము.. స్థానికులు ఏం చేశారంటే?
పాము పేరు విన్న, చూసిన చాలామంది భయపడతారని పాములతో భద్రంగా ఉండాలని స్నేక్ క్యాచర్ ఆజాం అన్నారు.

దిశ, కుల్కచర్ల: పాము పేరు విన్న, చూసిన చాలామంది భయపడతారని పాములతో భద్రంగా ఉండాలని స్నేక్ క్యాచర్ ఆజాం అన్నారు. చౌడాపూర్ మండల కేంద్రంలో ఓ ఇంట్లోకి పాము చొరబడటంతో స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. వెంటనే అతను అక్కడికి చేరుకొని పామును పట్టుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా పామును చూసి మనం ఎంత అలా భయపడతామో, అవి కూడా మనుషులను చూసి అంతే భయపడి కంగారులో వాటిని రక్షించుకునే క్రమంలో కాటు వేస్తుందన్నారు.
పాముకాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రమాదవశాత్తు పాముకాటుకు గురైతే కాటు వేసిన పై భాగంలో వెంటనే తాడుతో బిగించి కట్టి గాయం చేసి రక్తం కారనివ్వాలన్నారు. కాటుకు గురైన వ్యక్తిని నడిపించడం కానీ, పరుగులు పెట్టించవద్దని పలు అంశాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. స్నేక్ క్యాచర్ పామును పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.






