మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన క‌ల్పిస్తాం : డీసీపీ సీహెచ్ శిరీష

by Ratna Kumari |

ప్రజా భద్రతే తమ కర్తవ్యమని మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలలో మరింత అవగాహన కల్పిస్తామని షాద్ నగర్ జోన్ డిసిపి సిహెచ్ శిరీష అన్నారు.

మాదకద్రవ్యాల  నిర్మూలనపై  అవగాహన క‌ల్పిస్తాం :  డీసీపీ సీహెచ్ శిరీష
X

దిశ, షాద్ నగర్ : ప్రజా భద్రతే తమ కర్తవ్యమని మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజలలో మరింత అవగాహన కల్పిస్తామని షాద్ నగర్ జోన్ డిసిపి సిహెచ్ శిరీష అన్నారు. సోమ‌వారం ఏసీపీ కార్యాలయంలో నిర్వ‌హించిన గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా డీసీపీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం సవాళ్లతో కూడుకున్నదని, శాంతిభద్రతల పర్యవేక్షణకు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తామని అన్నారు. మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలకు బానిసలై బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని తెలిపారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తామని అన్నారు. కళాశాలలో, పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మాదకద్రవ్యాల నివారణకై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. షాద్ నగర్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని, సీనియర్ అధికారుల సూచనల మేరకు డివిజన్ లో సిబ్బంది తమ విధులను నిర్వహించాలని డీసీపీ శిరీష సూచించారు. కార్యక్రమంలో సీఐ విజయ్ కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్బీ ఎస్ఐ దేవకి, ఎస్సైలు ప్రణయ్, శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story