- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రైతులకు అండగా ఉంటాం’: ఎమ్మెల్యే
రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలనే వినియోగించుకోవాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు.

దిశ, పెద్దేముల్: రైతులు తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి సూచించారు. ఆదివారం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో డి.సి.ఎం.ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాలను ఆశ్రయించాలని కోరారు.
సకాలంలో నగదు జమ అయ్యేలా చర్యలు..
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, తూకంలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం విక్రయించిన అనంతరం నిబంధనల ప్రకారం రైతుల ఖాతాల్లోకి సకాలంలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధారాసింగ్, ఉపాధ్యక్షురాలు శోభారాణి, టిపిసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, మంబాపూర్ గ్రామ సర్పంచ్ భార్గవి, జనగాం సర్పంచ్ అరుణ, తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, మాజీ వైస్ చైర్మన్ జితేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రకాశం, హర్షవర్ధన్ రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు గోపాల్, కృష్ణ రెడ్డి, మైఫుజ్, శివారెడ్డి, లాల్ రెడ్డి, రత్నం, డివై నర్సింలు, వివిధ పార్టీల నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.






