- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిరిజన తండాల అభివృద్ధికి ఉప్పల ట్రస్ట్ భరోసా.. ఉప్పల వెంకటేశ్
ఆమనగల్లు నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పేర్కొన్నారు.

X
దిశ, ఆమనగల్లు: నియోజకవర్గంలోని గిరిజన తండాల అభివృద్ధికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పేర్కొన్నారు. బుధవారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లి పెంటతండ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తుల్జా భవాని దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మిఠాయిపల్లి పెంటతండలో నలుగురు నిరుపేదలకు ట్రస్టు ద్వారా స్వంత ఇంటి నిర్మాణం చేస్తామని శ్రీకారం చుట్టారు. గ్రామంలో 20 వీధిలైట్లు ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, నాయకులు శంకర్, పర్వతాలు, వెంకట్, కృష్ణ, శివలింగం, రాజు, బాలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






