- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదర్ గూడలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని రెండు షాపింగ్ మాల్స్‌లు సీజ్..
నగరంలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అత్తాపూర్ సర్కిల్‌లో ఫైర్ సేఫ్టీ లేని రెండు షాపింగ్ కాంప్లెక్స్‌లను శుక్రవారం జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్, విద్యుత్ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, తిరుమలేష్, చంద్ర నాయక్, సత్యనారాయణ గౌడ్‌ల ఆధ్వర్యంలో సీజ్ చేశారు.

దిశ, రాజేంద్రనగర్: నగరంలో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో అత్తాపూర్ సర్కిల్‌లో ఫైర్ సేఫ్టీ లేని రెండు షాపింగ్ కాంప్లెక్స్‌లను శుక్రవారం జీహెచ్ఎంసీ, హైడ్రా, ఫైర్, విద్యుత్ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, తిరుమలేష్, చంద్ర నాయక్, సత్యనారాయణ గౌడ్‌ల ఆధ్వర్యంలో సీజ్ చేశారు. హైదర్ గూడలో ఉన్న అను ఫర్నిచర్ భవనానికి పర్మిషన్ లేదని, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదని, సెల్లార్ లో అంతా ఫర్నిచర్ పెట్టారని గమనించిన అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేశారు. ఇదే ప్రాంతంలో గతంలో అగ్ని ప్రమాదం జరిగి ఆరుగురు కార్మికులు మరణించినట్లు అధికారులు గుర్తించారు.
అత్తాపూర్ లోని రాయల్ ఓక్ షాపింగ్ కాంప్లెక్స్ కు కూడా ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని, పర్మిషన్ లేదని, సెల్లార్ లో ఫర్నిచర్ తో నింపి వేశారని గుర్తించిన అధికారులు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ను కూడా సీజ్ చేశారు. సెల్లార్లను గోదాములగా మార్చడాన్ని అధికారులు తప్పు పట్టారు. సెల్లార్ లో ఫర్నిచర్ ను నిల్వ ఉంచడం నిబంధనలకు విరుద్ధమన్నారు. గోదాములు వేరే చోట పెట్టుకోవాలని, షాపుల్లో ఫర్నిచర్ ప్రదర్శన, అమ్మకాలు మాత్రమే ఉండాలన్నారు. ఇక పై ప్రతి దుకాణాన్ని తనిఖీ చేసి పరిశీలిస్తామన్నారు.






