మునగ సాగుతో సిరుల పంట.. లాభాల బాటలో రైతు!

by Naga Rani Yarlagadda |

మునగసాగుతో ఓ రైతు లాభాలు గడిస్తున్నాడు. ఏడాదిలోనే ఆశించిన దానికంటే అధిక లాభాలు రావడంతో అతని పంట పండిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

మునగ సాగుతో సిరుల పంట.. లాభాల బాటలో రైతు!
X

దిశ, దౌల్తాబాద్: సంప్రదాయ పంట లకు కాలం చెల్లిందని భావించిన ఆ రైతు.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపారు. దౌల్తాబాద్ మండలంలోని గోకఫసలాబాద్ గ్రా మానికి చెందిన రైతు గోవిందు క మ్మరి తనకున్న 5 ఎకరాల భూమి లో మునగ సాగు చేపట్టి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

సాహసోపేతం.. సత్ఫలితం..

సాధారణంగా ఈ ప్రాంతంలో వరి, మొక్కజొన్న వంటి పంటలను అ ధికంగా సాగు చేస్తారు. కానీ, నీటి వినియోగం తగ్గించుకుంటూనే స్థిర మైన ఆదాయం పొందాలనే లక్ష్యం తో గోవిందు ఏడాది క్రితం మునగ తోటను వేశారు. ప్రస్తుతం ఏడాది వయసున్న ఈ చెట్లు ఏపుగా పెరిగి దిగుబడికి సిద్ధమయ్యాయి. మార్కె ట్‌లో మునగకాయలకు ఉన్న ని రంతర డిమాండ్‌ను చూస్తుంటే, మునగ సాగులో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల సూచనలతో..

మునగ సాగులో మెళకువలు పాటి స్తూ, ఎరువుల యాజమాన్యం, కత్తిరింపుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో కాయ కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. చెట్టును కొంత ఎత్తులోనే కత్తిరించడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుందని తోటి రైతులకు వివరిస్తున్నారు.

శ్రమ తక్కువ.. లాభం ఎక్కువ..

వరి కంటే ము నగలో శ్రమ తక్కువ. ఒక్క సారి నాటితే కొన్ని ఏళ్ల పాటు దిగుబడిని పొందవచ్చు. 5 ఎకరాల్లో నేను చేసిన ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రభుత్వం, ఉద్యానవన శాఖ అధికారులు ప్రో త్సాహం అందిస్తే, ఈ ప్రాంతం లో మరిన్ని కొత్త పంటలు వేయడానికి రైతులు ముందుకు వస్తారు.

- గోవిందు కమ్మరి,

రైతు, గోకఫసలాబాద్.

Next Story