- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుర్కయంజాల్ ని సర్కిల్ గా మార్చాలి : అఖిలపక్ష నేతలు
దిశ, తుర్కయంజాల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహానగర పాలిక పేరిట ఏర్పాటు చేసిన డివిజన్ లో తుర్కయంజాల్ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని అఖిలపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దిశ, తుర్కయంజాల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహానగర పాలిక పేరిట ఏర్పాటు చేసిన డివిజన్ లో తుర్కయంజాల్ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని అఖిలపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తుర్కయంజాల్ పరిధిలోని రోక్కం సత్తి రెడ్డి గార్డెన్ లో అఖిలపక్ష నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు లక్ష జనాభా గల తుర్కయంజాల్ ప్రాంతాన్ని కేవలం రెండు డివిజన్లుగా మార్చడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రాంత జనాభాలో సగం జనాభా కూడా లేని పక్కనే ఉన్న ఆదిభట్ల ప్రాంతాన్ని సర్కిల్ గా మార్చడం ఏంటని అఖిలపక్ష నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా తుర్కయంజాల్ పేరొందిందన్నారు. విస్తీర్ణంలో పెద్దదైన తుర్కయంజాల్ ని సర్కిల్ గా మార్చకుండా ఆదిభట్లను సర్కిల్ గా మార్చడం, అశాస్త్రీయంగా డివిజన్లను ఏర్పాటు చేయడం 25 వేల ఓట్లకి ఒకటి విజయం 65 ఓట్లుకి మరొక డివిజన్ ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. దీనిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో జేఏసీగా ఏర్పడి పోరాటం మూడు తీర్మానాలను నిర్ణయించారు. తుర్కయంజాల్ ని సర్కిల్ గా మార్చాలనీ, తుర్కయంజాల్ ప్రాంతాన్ని ఎల్బీనగర్ జోన్ లో కలపాలనీ, తుర్కయంజాల్ మున్సిపాలిటీని నాలుగు డివిజన్లుగా విభజించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్, బిఎస్పీ సిపిఐ, సీపీఎం, టిడిపి పార్టీల నాయకులు కొత్తకురుమ మంగమ్మ, కళ్యాణ్ నాయక్, నోముల కార్తీక్ గౌడ్, ప్రేమ్ సాయి, చిన్నయ్య, పాండు, శ్రీకాంత్ చారి, గౌతమ్ రెడ్డి, ఆనంద్ కుమార్, సురేష్, శేఖర్ రెడ్డి, కాటం రాజు, శివ కుమార్, రావుల వీరేశం, ఓరుగంటి యాదయ్య, బలదేవ్ రెడ్డి, సత్యనారాయణ, ఎలిమినేటి నరసింహ రెడ్డి, మేతరి కుమార్, కొత్త కురుమ శివ కుమార్, డి. కిషన్, అరుణ్ కుమార్, పట్నం రమేష్ కురుమ, బచ్చిగల్ల రమేష్, మురళి, వద్దగల్ల బాబు, కొండ్రు పురుషోత్తం, మల్లెల దేవేందర్, శీలం అంగద్ కుమార్, నెమలి సత్యనారాయణ పాల్గొన్నారు.






