నేడే తుది విడత సమరం.. 163 సర్పంచు, 1,448 వార్డు స్థానాలకు ఎన్నికలు

by Ajay Maddhiboyina |

రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తుది సమరం బుధవారం జరగనున్నది. మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల,

నేడే తుది విడత సమరం.. 163 సర్పంచు, 1,448 వార్డు స్థానాలకు ఎన్నికలు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తుది సమరం బుధవారం జరగనున్నది. మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, అబ్దుల్లా పూర్‌ మెట్‌, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే సర్పంచుల ఫలితాలను ప్రకటించి ఆ వెంటనే ఉప సర్పంచుల ఎన్నిక ప్రక్రియను నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతోంది. ఎన్నికల ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

బస్సులలో తరలివెళ్లిన సిబ్బంది..

మూడో విడతలో 174 పంచాయతీలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా.. 10 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 6 పంచాయతీలు వార్డులతో సహా ఏకగ్రీవం అయ్యాయి. వీటిల్లో ఉప సర్పంచు ఎన్నిక కూడా పూర్తయింది. అలాగే 1,598 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఇందులో 142 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మాడ్గుల మండలం నర్సంపల్లి గ్రామ పంచాయతీ కేసు కోర్టులో ఉండటంతో ఈ పంచాయతీకి ఎన్నిక నిర్వహించడం లేదు. బ్యాలెట్‌ బాక్సులు, పత్రాలు, ఓటర్‌ జాబితా, పోలింగ్‌ సామాగ్రితో సిబ్బంది ఆయా గ్రామాలకు మంగళవారం సాయంత్రమే బస్సుల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. సున్నితమైన పోలింగ్‌ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్లు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. సమస్యాత్మక కేంద్రాలలో వీడియో గ్రఫీ ఏర్పాటు చేశారు.

ఎన్నికలు జరుగుతున్న మండలాలు

ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, అబ్దుల్లాపూర్‌ మెట్‌, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు

- ఏకగ్రీవమైన పంచాయతీలు - 10

- ఏకగ్రీవమైన వార్డులు - 142

- ఎన్నికలు జరుగుతున్న పంచాయతీలు - 163

- బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య - 559

- ఎన్నికలు జరుగుతున్న వార్డులు - 1,448

- బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య - 4,091

Next Story