- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దశాబ్ది ఉత్సవాలకు దూరంగా ఉన్న గ్రామం.. కారణం ఏంటో తెలుసా..
చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా అదనంగా పనులు చెప్పడం కరెక్ట్ కాదని తొండపల్లి సర్పంచ్ మోముల గీత టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును, అధికారులు తీరును తప్పు పట్టారు.

దిశ, పరిగి : చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా అదనంగా పనులు చెప్పడం కరెక్ట్ కాదని తొండపల్లి సర్పంచ్ మోముల గీత టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును, అధికారులు తీరును తప్పు పట్టారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని శుక్రవారం తొండపల్లిలో సర్పంచ్ మోముల గీత, నాయకులు హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్, సోనియా గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముందుగా తెలంగాణ రాష్ట్రమిచ్చిన సోనియా గాంధీకి మనందరం కృతజ్ఞతలు తెలుపాన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం, అధికారులు ప్రతి అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు చేయమని చెబుతున్నారే తప్పా సర్పంచుల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదని తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది కానీ ఇలా 20 రోజుల వరకు చేయాలంటే సర్పంచులకు భారమేనని ఆమె తప్పుపట్టారు. తొండపల్లి సర్పంచ్ మోముల గీతకు మద్దతు చిట్యాల సర్పంచ్ బద్రిగారి రజిత కూడ అధికారులు టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి, బద్రి గారి రాజ్ పుల్లారెడ్డి, తొండపల్లి, చిట్యాల గ్రామస్తులు పాల్గొన్నారు.






