18వ అంత‌స్తు నుంచి దూకి యువ‌కుడి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

by Nallavelli.Anjaneyulu |

డిప్రెషన్ తో బాధపడుతున్న ఓ యువకుడు అపార్ట్మెంట్ 18 వ అంతస్తు బాల్కని నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.

18వ అంత‌స్తు నుంచి దూకి యువ‌కుడి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
X

దిశ, గండిపేట : డిప్రెషన్ తో బాధపడుతున్న ఓ యువకుడు అపార్ట్మెంట్ 18 వ అంతస్తు బాల్కని నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్ స్పెక్ట‌ర్ హరికృష్ణా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కునాపు రెడ్డి శ్రీనివాస్ కుమారుడు ఆశిష్ (33) స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నాడు. గురువారం కాళీ మందిర్ సమీపంలోని పీబీఈఎల్ సిటీ లో టవర్-డి 18వ అంతస్తులో ఉన్న తన మామ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కొద్దిసేపటి తర్వాత కజిన్ అయాన్ ఇంటికి చేరుకుని టెలివిజన్ చూస్తున్నాడు. ఈక్రమంలో మధ్యాహ్నం ఆశిష్ బాల్కనీ నుంచి కిందికి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వెంటనే అపార్ట్‌మెంట్ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆశిష్ కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, ఈ నేపథ్యంలోనే అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మృతుడి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్ట‌ర్ హరికృష్ణా రెడ్డి తెలిపారు.

Next Story