- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

X
దిశ,నందిగామ: కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం నందిగామ మండలంలోని అప్పారెడ్డి గూడ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల 38 మంది ఇండ్లకు ముగ్గు పోసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని నిరుపేదలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాంగా నరసింహ, మాజీ ఎంపిటిసి లు కుమార్ గౌడ్, చంద్రపాల్ రెడ్డి, కావాలి కృష్ణ, సీతారాములు, సంబంధిత అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






