ప్రభుత్వ బడుల బాధ్యత ‘సర్పంచుల’దే !

by Batti.Sumithra |

సర్కారు బడుల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ బడుల బాధ్యత ‘సర్పంచుల’దే !
X

దిశ, కొడంగల్ : సర్కారు బడుల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ, అభివృద్ధిలో సర్పంచుల పాత్రను మరింత కీలకం చేస్తూ విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యావ్యవస్థను బలోపేతం చేయడంలో సర్పంచులే కీలకంగా నిలవనున్నారు.

సర్పంచులకు ప్రత్యేక వర్క్‌షాప్‌లు...!

పాఠశాలల నిర్వహణ పై సర్పంచులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు జూన్ నెలలో ఒకరోజు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. జిల్లా స్థాయి అధికారులకు (DEO) ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామంలోని బడి బాధ్యతను ప్రజాప్రతినిధులు సొంతం చేసుకునేలా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉండనున్నాయి.

సర్పంచులు.. కీలక బాధ్యతలు..!

ప్రాథమిక సౌకర్యాలు పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతుల కల్పనను నిరంతరం పర్యవేక్షించాలి.‘బడి బాట’ ప్రోగ్రామ్ ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలి. ప్రతి బిడ్డ బడిలో ఉండేలా చూడటం సర్పంచుల ప్రాథమిక విధి. పథకాల అమలు..!'అమ్మ ఆదర్శ పాఠశాలలు' ఇతర ప్రభుత్వ విద్యా పథకాల పై సమగ్ర అవగాహన కలిగి ఉండి, అవి క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలయ్యేలా చూడాలి.

ప్రభుత్వ బడుల పై ప్రజల్లో నమ్మకం !

గ్రామస్తులకు సర్పంచులతో ఉండే సత్సంబంధాలను వాడుకొని, ప్రభుత్వ పాఠశాలల పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం. ప్రైవేట్ బడులకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దడంలో సర్పంచులు క్రియాశీలక పాత్ర పోషించాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.

Next Story