రుణమాఫీ సంబురం.. రైతుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం.!

by Geesa Chandu |

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంపై రైతులు ఖుషీగా ఉన్నారు.

రుణమాఫీ సంబురం.. రైతుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం.!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రుణమాఫీ చేయడంపై రైతులు ఖుషీగా ఉన్నారు. రేవంత్సర్కారు రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని అభిప్రాయ పడుతున్నారు. రైతు రక్ష ప్రభుత్వానికి అండగా ఉంటామని పేర్కొంటున్నారు.అధికారంలోకొచ్చేందుకు అన్ని పార్టీలు ఎన్నికల్లో హామీలిచ్చినా అమలులో జాప్యం జరుగుతుంది. భూమిని నమ్ముకొని సాగు చేసే రైతుకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నం చేస్తాయి. అందులో భాగంగానే రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీఆర్ ఎస్ ప్రభుత్వం రైతులకు రూ.లక్ష రుణమాపీ చేస్తానని హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని దఫాల వారీగా నాలుగేండ్లు ఇవ్వడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.2లక్షల రుణమాపీ చేస్తామని హామీ ఇచ్చింది. అంతేగాక ఆగస్టు 15లోపు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్​ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ఆ మాటకు కట్టుబడి మూడు విడుతల్లో రుణాలను మాఫీ చేశారు. మొదటి ధపా లక్ష, రెండో ధపా రూ.1.50లక్షలు, మూడో దఫా రూ.2లక్షల రుణాలు మాఫీ చేశారు. అయితే ప్రధానమంత్రి కిసాన్​ యోజన పథకం గైడ్​ లైన్స్​ ఆధారంగానే రుణాలు మంజూరు చేయడం జరిగింది. అయితే కొన్ని టెక్నికల్​ కారణాలతో కొంత మంది పేర్లు జాబితాలో కనిపించడం లేదు. కానీ అర్హతగల రైతులకు తప్పకుండా రుణాలను మంజూరుకు ప్రభుత్వం కలెక్టరేట్​ ప్రాంగణంలో గ్రీవెన్స్​ ఏర్పాటు చేశారు. ఈ గ్రీవెన్స్​లో రైతులు సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని అధికారులు వివరిస్తున్నారు.

మూడు విడుతల్లో ఏకకాలంలో రుణమాఫీ...

రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా రూ.2లక్షల రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేశారు. కానీ మూడు విడుతల్లో స్లాబుల వారీగా నిర్ణయం తీసుకోనిరూ.లక్ష, రూ.లక్ష యాభై వేలు, రూ.2లక్షల చొప్పున మాఫీ చేసింది.అయితే రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూములు తక్కువ ఉన్నప్పటికీ రుణాల తీసుకున్న వారు గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి,వికారాబాద్​ జిల్లాలో మొదటి విడుతలకు అత్యధిక సంఖ్యలో ఉంటే రెండు, మూడోవ విడుతల రుణాల మాఫీలో తక్కువగానే కనిపించారు. మూడు విడుతల్లో్ రంగారెడ్డిలో 87,841 రైతులకు రూ.661.71 కోట్లు...వికారాబాద్​లో 90,618 రైతులకు రూ.751.74 కోట్ల చోప్పున రుణాలు మాఫీ చేసినట్లు అధికారిక లెక్కలు చేబుతున్నాయి.

విడుతల వారీగా ఇలా...

రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో రుణాలు విడుతల వారీగా రాష్ట్రప్రభుత్వం చెల్లించారు. మొదటి విడుత రంగారెడ్డిలో 49,700 మందిరైతులకు రూ.258.18కోట్లు... వికారాబాద్​లో 46,633 మంది రైతులకు రూ.256.26కోట్లు... రెండవ విడుత రంగారెడ్డిలో 22,915 మంది రైతులకు 218.12 కోట్లు... వికారాబాద్​లో 26,438 మంది రైతులకురూ.262.64కోట్లు, మూడోవ విడుత రంగారెడ్డిలో 15,226 మంది రైతులకు రూ.185.41కోట్లు వికారాబాద్​లో17,547 మంది రైతులకురూ.232.84 కోట్లు చోప్పున రుణాలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం..

నీరటి లక్ష్మమ్మ, నర్సప్పగూడ, రైతు

రైతు రుణమాఫీ పక్రియ లోభాగంగా పేద రైతులకు రుణమాఫీ చేయడం చాలా ఆనందంగా ఉంది. మేము ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ నిమర్చిపోలేం. మాది నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామం మాకు1.50 లక్షల రుణం మాఫీ అయ్యింది.

బ్యాంకోళ్లు మళ్లా లోను ఇస్తమంటున్నరు..

- కృష్ణయ్య, రైతు కొత్తూరు మండలం

నా కున్న రూ.1,68,000 ఒక్కసారే మాఫీ అయ్యింది. ఎప్పుడు అనుకోలే నా అప్పును గవర్నమెంటు కడుతదని. ఒక్కప్పుడు బ్యాంకుకు పోతే అప్పుఎప్పుడు కడుతవు అని అడిగేటోళ్లు. కానీ ఇయ్యాల బ్యాంకుకు పోతే నీపైసలు మాఫీ అయినవి మళ్లీ లోను ఇస్తమంటున్నరు. చాలా సంతోషంగా ఉంది. ఎవుసం బందవెడ్తం అనుకునేటోళ్లకు ఊపిరి పోసినట్టు అయినఈ రుణమాఫీ ఎప్పటికి గుర్తుంటది. రుణమాఫీ తో కష్టాలు తీరాయి

- రైతు మహ్మద్ అక్బర్,

యాచారం(మం) గాండ్లగూడ(గ్రా)

నేను తీసుకున్న రూ.50వేల రుణం మాఫీ కావడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పటి ప్రభుత్వం ఒకేసారి రుణమాఫీచేయడంతో కష్టాలు తీరాయి. అప్పు తీరింది..

- షరీఫ్, రైతు, మర్పల్లి

నా కూతురు వివాహానికి లక్ష రూపాయలు అప్పు చేశా. నాకున్న రెండెకరాల్లో కంది, మొక్క జొన్న పంట సాగు చేశా.పరిస్థితులు అనుకూలంగా లేక నష్టపోయ. నేను మర్పల్లి సహకార సంఘంలో తీసుకున్న లక్ష నలభైవేలు మాఫీ కావడం ఆనందంగా ఉంది. దీంతో నా అప్పు తీర్చుకుని మిగిలిన డబ్బులను పంటకు పెట్టుబడికి వాడుతా. నా రుణం మాఫీ చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎప్పటికీ రుణపడి ఉంటా.

Next Story