' మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి '

by Batti.Sumithra |   (  Updated:2025-11-03 04:57:56  IST  )

: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జా గూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

 మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి
X

దిశ, తాండూరు : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జా గూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని ఆయన కోరారు.

Read More.. మీర్జాగూడ బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రులు దిగ్భ్రాంతి

Next Story