ఇళ్లు లేని నిరుపేదలను ఇంటి యజమానులుగా మార్చడమే లక్ష్యం

by Taduka Kalyani |

ఇల్లు లేని నిరుపేదలను సొంతింటి యజమానులుగా మార్చడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు.

ఇళ్లు లేని నిరుపేదలను ఇంటి  యజమానులుగా మార్చడమే లక్ష్యం
X

దిశ, షాద్ నగర్: ఇల్లు లేని నిరుపేదలను సొంతింటి యజమానులుగా మార్చడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. ఎమ్మెల్యే స్వగృహంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో శుక్రవారం ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ షాద్ నగర్ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలను సొంతింటి యజమానులుగా మార్చడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 2200 ఇల్లు పూర్తయ్యాయని, 750 ఇళ్ల నిర్మాణంలో వివిధ దశల్లో ఉన్నాయని, మరో 750 మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించలేదని అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గానికి అదనంగా ఇళ్ల ను ప్రభుత్వం మంజూరు చేసిందని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, టాక్సీలు నడిపే వారికి ఇళ్లు మంజూరులో కేంద్ర ప్రభుత్వం నిబంధనలతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, వాటిని త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నిరుపేదలకు ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులను సక్రమంగా ఇస్తుందని, కేంద్ర ప్రభుత్వమే జాప్యం చేస్తుందని తెలిపారు. గడువు దాటిన ఇంటి పనులను ప్రారంభించని లబ్ధిదారులకు అధికారులు నోటీసులు ఇస్తారని, నోటీసులు తీసుకున్నా ఇంటి నిర్మాణాలను ప్రారంభించకపోతే అర్హులైన మరో లబ్ధిదారునికి బదిలీ అవుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు.

Next Story