- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలియో రహిత సమాజమే లక్ష్యం..
పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, మొయినాబాద్: పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అంగవైకల్యాన్ని నివారించి చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మొయినాబాద్ మున్సిపాలిటీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ స్వర్ణకుమారి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్, చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామెన భీమ్ భరత్, రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మున్సిపల్ చైర్‌పర్సన్ షాబాద్ సోనియా దర్శన్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, పీహెచ్‌సీ అధికారిణి డాక్టర్ అన్నపూర్ణ, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ అక్రమ్, సీహెచ్‌ఓ వెంకట్‌రెడ్డి, హెచ్‌ఈ రంగనాయకమ్మ, డాక్టర్ సాయిబాబా, ఆర్‌బీఎస్‌కే వైద్యులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య, వైస్ ప్రెసిడెంట్ మర్రి రవీందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు మహేందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, కంజర్ల భాస్కర్, బద్రప్ప, జయరామ్ రెడ్డి, అనంత రెడ్డి, వెంకట్ రెడ్డి, గణేష్ గౌడ్, బాలకృష్ణా రెడ్డి, కేబుల్ రాజు, చిలుకూరు రాజు, విఠల్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






