- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల
ప్రజాపాలన ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు

దిశ, కడ్తాల్ : ప్రజాపాలన ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని గానుమర్లతండా లో నేనావత్ కమలి, ఇస్లావత్ భీమన్,నేనావత్ రాంలీ,నేనావత్ సునీత, మంగలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మాణమైన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ యాట గీత,స్థానిక నాయకులతో కలిసి ఇల్లును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాల అభివృద్ధి, రైతుల సొంతింటి కల నెరవేరుతుందని ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లును అందిస్తామన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు హన్మ నాయక్, డీసీసీ అధికార ప్రతినిధి బిక్యా నాయక్, సర్పంచ్ సేవ్యా నాయక్, ఉప సర్పంచ్ లక్పత్ నాయక్, నాయకులు హంష మోత్య నాయక్, హీరా సింగ్, పాండు నాయక్, రాజు నాయక్, గోపి నాయక్, రాజు, శ్రీను, నాగార్జున్, సీనియర్ నాయకులు మోత్య, రాజు, లక్ష్మణ్, పథ్య, హరిలాల్, శ్రీకాంత్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






