కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి

by Nallavelli.Anjaneyulu |

ఫోన్ టాపింగ్ విషయంలో సిట్ విచారణ పేరుతో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులను, నాయకులను విచారణకు పిలిచిన విష‌యం తెలిసిందే.

కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి
X

దిశ, మాడ్గుల : ఫోన్ టాపింగ్ విషయంలో సిట్ విచారణ పేరుతో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులను, నాయకులను విచారణకు పిలిచిన విష‌యం తెలిసిందే. ప‌దేళ్లు సీఎంగా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారణ పేరుతో ఇబ్బందులు గురిచేయడం కక్ష సాధింపు చర్యలేనని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏమి రెడ్డి జైపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం బిఆర్ఎస్ రాష్ట్ర అధినాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు మాడ్గుల మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ అనేది రాష్ట్ర అంతర్గతంగా భద్రత గురించి ఆయా రాష్ట్రాలు నిఘా వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని అసలు ఇది కేసే కాదన్నారు. కేవలం రాజకీయంగా కక్ష సాధిస్తూ మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందాలని చూస్తున్నట్లు వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జ‌డ్పిటిసి పగడాల రవి, మాజీ ఎంపీపీ జైపాల్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, సర్పంచ్ కోరుకోరు తిరుపతయ్య, నాయకులు గౌని లాలయ్య గౌడ్ రెడ్డి కృష్ణారెడ్డి, రమేష్ రెడ్డి, అంబాల జంగయ్య గౌడ్, నిరంజన్ జి ,గ్యార చంటి, సురమల్ల చెన్నయ్య, కలకొండ శీను, పవన్ కుమార్ రెడ్డి, సురమల చెన్నయ్య, ఉపసర్పంచ్ సత్తూరి వెంకటయ్య గౌడ్ వరుణ్, అనిల్ జి, కేశ మౌని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story