- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ ను వేధింపులకు గురి చేస్తుంది
రాజకీయ కక్షతోనే కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ వేధింపులకు గురి చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు.

దిశ, మీర్ పేట్ : రాజకీయ కక్షతోనే కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ వేధింపులకు గురి చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని ధాతు నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ అధ్యక్షులు కామేష్ రెడ్డి, రాంరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి తో కలిసి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లెల గూడ మీదుగా నల్ల బ్యాడ్జీలు ధరించి బాలాపూర్ కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు ఎన్నో అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ దొంగ హామీలను నెరవేర్చడం చేతకాక.. పరిపాలనను గాలికొదిలేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తూ.. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేకవారి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందన్నారు. ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ ను రాజకీయ కక్షతో ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్అనే అక్రమ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్ర సృష్టికర్తల జోలికి వస్తే, చివరికి చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం. తెలంగాణ కోసం కేసీఆర్ 25 ఏళ్ల నిరంతర శ్రమ ఫలితం. తెలంగాణకు అన్నీ తానై ముందుండి నడిపించారు అలాంటి వ్యక్తిపై సంబంధంలేని కేసులు పెట్టి విచారణ పేరుతో ఆయన స్థాయిని దిగదర్చాలని చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.






