సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిది : ఎమ్మెల్యే

by Batti.Sumithra |

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరంలాంటిదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం లాంటిది : ఎమ్మెల్యే
X

దిశ, నందిగామ : సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరంలాంటిదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం షాద్ నగర్ క్యాంపు కార్యాలయంలో చేగూర్ సర్పంచ్ మంకాల శ్రీశైలం ఆధ్వర్యంలో చేగూర్ గ్రామానికి చెందిన కొమురయ్యకు సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున సీఎం సహాయనిధి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగల్ నరసింహ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story