- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉర్సు ఉత్సవ ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి : బీఆర్ఎస్ నాయకులు
మండలంలోని ఇన్ముల నర్వ పరిధిలో ఉన్న జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ అధికారులు ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు షేక్ హనీఫ్ ఆరోపిస్తూ అసహనం వ్యక్తం చేశారు.

దిశ, కొత్తూరు : మండలంలోని ఇన్ముల నర్వ పరిధిలో ఉన్న జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ అధికారులు ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు షేక్ హనీఫ్ ఆరోపిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో అత్యంత వైభవంగా జరగనున్న ఈ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటి వరకు పనులు పూర్తికాకపోవడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్సు ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలని, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నిరంతర తాగునీటి సరఫరా కల్పించాలని సూచించారు. అలాగే దర్గా పరిసరాల్లో సరిపడా వెలుతురు ఏర్పాటు చేయడంతో పాటు పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఉత్సవాలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నందున అధికారులు యుద్ధప్రాతిపదికన స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని షేక్ హనీఫ్ డిమాండ్ చేశారు.






