- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రభుత్వానికి ఫార్మా రైతుల బాధలు పట్టవా?’.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
ఫార్మాసిటీ రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

దిశ, యాచారం: ఫార్మాసిటీ రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండల పరిధిలోని మర్లకుంట తండా, మంగలిగడ్డ తండా, గిరిజన మహిళ రైతులు గ్రీన్ ఫీల్డ్ రోడ్డును రద్దు చేయాలని గత 53 రోజులుగా నిరాహార దీక్ష చేపడుతుండగా సోమవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఫార్మాసిటీ రైతులు చేస్తున్న పోరులో ప్రత్యక్షంగా పాల్గొని హామీలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదని బలవంతంగా భూములు ఎందుకు లాక్కుంటున్నారని నిలదీశారు. ఎస్సీ ఎస్టీ బీసీలే బాధితులుగా మిగులుతున్నారని వివరించారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూ బాధిత గిరిజన రైతులకు అండగా ఉంటానని ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సభ్యులు కవుల సరస్వతీ, కుందారపు నారాయణ, శ్రీకాంత్, దేవోజి, గిరిజన రైతులు పాల్గొన్నారు.






