అనుమానస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి

by Jakkula.Mamatha |

అనుమానస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

అనుమానస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి
X

దిశ, ఇబ్రహీంపట్నం: అనుమానస్పద స్థితిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ చిలుకనగర్‌కు చెందిన సతీష్ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని ఆరుట్ల మోడల్ స్కూల్‌లో గణిత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. కాగా ఆయన గత కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఇబ్రహీంపట్నంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాగా ఆదివారం ఆయన అద్దె ఇంట్లో బాత్రూంలో పడిపోయి మృతి చెందాడు. దీంతో స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం పోస్టుమార్టం గదికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం చేరుకొని మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సింది

Next Story