- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సేవ చేసే నేతలను గుర్తించండి.. జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్..
ఈ సమాజంలో మనిషిగా జన్మించినందుకు ఏదో ఒకటి సాధించాలని దృఢ సంకల్పంతో తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అన్నారు.

దిశ, తలకొండపల్లి : ఈ సమాజంలో మనిషిగా జన్మించినందుకు ఏదో ఒకటి సాధించాలని దృఢ సంకల్పంతో తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ అన్నారు. మండలంలోని పాతకోట తండాకు చెందిన ఉపసర్పంచ్ కాట్రావత్ పద్మ గురుసింగ్ తో పాటు రాంచందర్, కిషన్, పాండు మరికొంతమంది నాయకులు ఉప్పల ట్రస్ట్ చేసే సేవలకు ఆకర్షితులై వెంకటేష్ నాయకత్వంలో పనిచేయడానికి ఆదివారం తన నివాసంలో పుష్పగుచ్చం అందజేసి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ తలకొండపల్లి జెడ్పీటీసీగా తనను గెలిపించిన ఈ గడ్డకు ఏమిచ్చినా తన రుణం తీర్చుకోలేనని, కేవలం జడ్పీటీసీగా గెలిపించినందుకే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా తనను ఆదరించి అభిమానించి గెలిపిస్తే నియోజకవర్గ వ్యాప్తంగా పూరిగుడిసెలు, రేకుల ఇల్లు లేని ప్రాంతంగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని అధికారంలో ఉన్న ఏ నేత కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలకు విన్నవించారు.






