- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ సబ్ స్టేషన్‌పై దాడిచేసిన నిందితులకు 5 ఏళ్ల జైలు శిక్ష
by Kodari Anjali |
విద్యుత్ సబ్ స్టేషన్‌పై దాడిచేసిన వారికి జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానాలు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

X
దిశ, వలిగొండ: విద్యుత్ సబ్ స్టేషన్‌పై దాడిచేసి సిబ్బందిని గాయపరిచిన ఘటనలో ముగ్గురు నిందితులకు 5 సంవత్సరాల జైలు శిక్షను రామన్నపేట సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి. సబిత తీర్పు వెలువరించారు. శుక్రవారం వలిగొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023 వ సంవత్సరంలో కళ్లెం నరేష్, (వలిగొండ) వేముల నర్సింగ్ (పులిగిల్ల) బల్లెపు కృష్ణస్వామి(వలిగొండ) ముగ్గురు నిందితులు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్, సిబ్బందిపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడిన ముగ్గురి నిందితులపై కేసు నమోదు చేశారు. కేసు పూర్వ పరాలను పరిశీలించి తగు సాక్షాల ఆధారంగా న్యాయమూర్తి నిందితులకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు ఒక్కొక్కరికి 11 వేల రూపాయల జరిమాన విధించినట్లు ఎస్సై యుగంధర్ గౌడ్ తెలిపారు.
Next Story






