- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
by Taduka Kalyani |
ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు.

X
దిశ, షాద్ నగర్: ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. సోమవారం ఫరూక్ నగర్ మండల పీఎసీఎస్ షాద్ నగర్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించి కనీస మద్దతు ధర పొందొచ్చని సూచించారు.
గ్రామస్థాయిలో అధికారులు పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ చైర్మన్ రాజా వరప్రసాద్, సింగిల్ విండో చైర్మన్ బక్కన్న యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, రవీందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.
Next Story






