ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

by Taduka Kalyani |

'వన్ వార్డ్ ఎవ్రీ డే' కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో కలిసి గురువారం నార్సింగి సర్కిల్ పరిధి నేక్నాంపూర్ వార్డులో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
X

దిశ, గండిపేట: 'వన్ వార్డ్ ఎవ్రీ డే' కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌తో కలిసి గురువారం నార్సింగి సర్కిల్ పరిధి నేక్నాంపూర్ వార్డులో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ) ప్రతినిధులతో సమావేశమై పౌర సమస్యలు, అభివృద్ధి పనులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పర్యటనలో వీధి దీపాల ఏర్పాటు, ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్, ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ) సామర్థ్యం పెంపు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, పార్కుల్లో లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, వైన్ షాపుల తరలింపు, పాషా కాలనీలో నీటి నిల్వ సమస్యల పరిష్కారంపై స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రెవెన్యూ, ఇంజినీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఎంటమాలజీ, వెటర్నరీ శాఖల అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ లక్ష్మారెడ్డి, అధికారులు, ఆల్ కాలనీస్ ఫెడరేషన్ ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Next Story