పార్కు స్థ‌లాల‌ను క‌బ్జా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు : డిప్యూటీ క‌మిష‌నర్ మ‌ల్ల‌య్య

by Ratna Kumari |

అత్తాపూర్ సర్కిల్ పరిధిలో పబ్లిక్ పార్కుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్ మల్లయ్య వెల్లడించారు.

పార్కు స్థ‌లాల‌ను క‌బ్జా చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు :  డిప్యూటీ క‌మిష‌నర్ మ‌ల్ల‌య్య
X

దిశ‌, రాజేంద్రన‌గ‌ర్ : అత్తాపూర్ సర్కిల్ పరిధిలో పబ్లిక్ పార్కుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు డిప్యూటీ కమిషనర్ మల్లయ్య వెల్లడించారు. ఆయా కాలనీలు బస్తీల లేఔట్ల మధ్య పార్కుల కోసం కేటాయించిన స్థలాలను కబ్జా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. శనివారం ఉదయం హైదర్ గూడ డివిజన్ పరిధిలోని సోమిరెడ్డి నగర్, లక్ష్మీ రామ్ హరన్ అపార్ట్మెంట్ ప్రాంతాలలో డిప్యూటీ కమిషనర్ పర్యటించారు. అపార్ట్మెంట్ల మధ్య బస్తీల మధ్య ఉన్న పార్కు స్థలాలను పరిశీలించారు. మెయిన్ రోడ్లపై, ప్రధాన కాలనీలలో ఉన్న పబ్లిక్ పార్కుల మాదిరిగానే ఆయా హుడా లే ఔట్ల మధ్య వదిలిన పార్కు స్థలాలను అభివృద్ధి చేయడం పై తాము దృష్టి సారిస్తున్నామని ఆయన స్థానికులకు తెలిపారు. తమ ప్రయత్నంలో భాగస్తులు కావాలని, అభివృద్ధికి తమతో కలిసి రావాలని డిప్యూటీ కమిషనర్ ప్రజలను కోరారు. పార్కు స్థలాలను ప్రైవేట్ అవసరాలకు వాడుకున్న, చెత్త వేసిన, కబ్జా చేయడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ కమిషనర్ వెంట సామాజిక కార్యకర్త మ్యాడం మధు ఉన్నారు.

Next Story