అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై విఠల్ రెడ్డి

by I. Sairam |

అక్రమంగా ఇసుకను తవ్వి, రవాణా చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఎస్సై విఠల్ రెడ్డి హెచ్చరించారు.

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్సై విఠల్ రెడ్డి
X

దిశ, యాలాల: అక్రమంగా ఇసుకను తవ్వి, రవాణా చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఎస్సై విఠల్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఉదయం 6:00 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు యలాల్ పోలీసులు బాగాయి పల్లి చౌరస్తాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న న్యూహోలాండ్ ట్రాక్టర్ ఇంజిన్ నెంబర్ TS 34G5429, ట్రోలీ నెంబర్. AP07TA8805 ను పట్టుకొవడం జరిగిందన్నారు. అదే సమయంలో ట్రాక్టర్ యొక్క డ్రైవర్ అక్కడి నుండి పారిపోవడం జరిగిందన్నారు. అట్టి ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కి తరలించి సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై విటల్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన స్టాక్ పాయింట్లలో నిబంధనల ప్రకారం ఇసుకను లోడ్ చేయించి, తగిన రశీదులతో రవాణా చేసుకోవాలన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఇతర శాఖలతో కలిసి సంయుక్తంగా 24 గంటలు తనిఖీలు చేస్తున్నామన్నారు. కట్టల నుంచి ఇసుకను తరలించడం వల్ల భారీ వర్షాల సమయంలో సమీపంలోని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

Next Story