- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలప అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు..
అక్రమంగా కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గిరి హెచ్చరించారు.

X
దిశ, కుల్కచర్ల : అక్రమంగా కలప రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గిరి హెచ్చరించారు. కుల్కచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో బుధవారం పోలీసులు గోపాల్, ఆంజనేయులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా తెల్లవారుజామున పుట్టాపహాడ్ గ్రామ సమీపంలో TS 34 A 5048 నంబర్ గల ట్రాక్టర్ కలపలోడ్ తో వెళ్తుండగా పోలీసులు డ్రైవర్ గండిటి బీమయ్యను ఆపి విచారించారు.
అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టరు పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్ గండిటి బీమయ్య పై కేసునమోదు చేశారు. ఈ ట్రాక్టర్ ను అటవీశాఖ అధికారులకు అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఎస్సై గిరి మాట్లాడుతూ అక్రమంగా కలపరవాణా చేసిన,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story






