తేలిన నామినేషన్ల లెక్క

by velandi.Saikiran |   (  Updated:2026-01-31 22:30:17  IST  )

రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్‌ నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియ శనివారం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా మొత్తం 886 నామినేషన్లు దాఖలయ్యాయి.

తేలిన నామినేషన్ల లెక్క
X

తేలిన నామినేషన్ల లెక్క

615 నామినేషన్లు ఆమోదం

6 మున్సిపాలిటీల నుంచి 886 నామినేషన్లు దాఖలు

డబుల్‌ నామినేషన్ల తొలగింపు

ముగిసిన స్క్రూటిని ప్రక్రియ

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్‌ నామినేషన్ల స్క్రూటిని ప్రక్రియ శనివారం ముగిసింది. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా మొత్తం 886 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని క్షుణ్ణంగా అధికారులు పరిశీలించారు. చాలా మంది అభ్యర్థులు రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా.. వాటిలో ఒక్క నామినేషన్‌‌ను అధికారులు పరిగణలోకి తీసుకున్నారు. స్క్రూటిని అనంతరం 615 మంది అభ్యర్థులకు సంబంధించి 615 నామినేషన్లు ఆమోదం పొందినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో కాంగ్రెస్-227, బీఆర్‌ఎస్-170, బీజేపీ-132, సీపిఎం-7, బీఎస్పీ-4, ఎంఐఎం-4, ఆల్‌ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్‌-4, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా-3, జనసేన-10, ఇతర గుర్తింపు పొందిన పార్టీలు-7, స్వతంత్రులు-47 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉప సంహరణ గడువు అనంతరం ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల లెక్క తేలనున్నది.

ఆమోదం పొందిన దరఖాస్తులు..

మున్సిపాలిటీ వార్డులు నామినేషన్లు

ఆమన్‌‌గల్‌ 15 72

చేవెళ్ల 18 78

ఇబ్రహీంపట్నం 24 125

మొయినాబాద్‌ 26 108

షాద్‌‌నగర్‌ 28 147

శంకర్‌‌పల్లి 15 85

మొత్తం 126 615

Next Story