బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ దీపక్ తివారి

by Ratna Kumari |

బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు.

బాల్యవివాహాల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి :  కలెక్టర్ దీపక్ తివారి
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి : బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సూచించారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లో 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బాలల మాక్ పార్లమెంట్ - స్నేహ కౌమార బాలికలతో బాలల హక్కుల సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిగమించవచ్చని దానికి విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. విద్యార్థి దశ నుంచే సమాజంపై అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు. అసెంబ్లీ పార్లమెంటరీ సమావేశాల్లో చర్చించే విషయాలపై అవగాహన కల్పించుకోవాలని తెలిపారు. నూతనంగా వచ్చిన ఏఐ విధానంపై అవగాహన కల్పించుకుని సాంకేతికతను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యం అని మహాత్మా గాంధీ సూచించిన విషయాన్ని జిల్లా కలెక్టర్ ఈసందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో తమ లక్ష్యాన్ని ఎంచుకోవడంలో ఉన్నత అధికారుల సలహాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో స్నేహ సంఘాల్లో సభ్యులుగా చేరాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికి జిల్లాలో 4500 స్నేహ సభ్యులుగా నమోదు చేసుకున్నారని స్నేహ సంఘాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని జిల్లా యంత్రాంగం తరఫునుంచి తమ సహకారం కచ్చితంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. మాక్ పార్లమెంటరీలో విద్య ఆరోగ్యం హోం శాఖలపై చర్చించారు. మా పార్లమెంటరీ లో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మంత్రులుగా స్నేహ సంఘాల సభ్యులు మంచి పాత్రను పోషించారని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా నూతన అక్షరాస్యులుగా చదువు నేర్చుకున్న అభ్యాసకులకు చదువు నేర్పిన వాలంటీర్లకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో డీఆర్డీఏ శ్రీనివాస్ అదనపు డీఆర్డీఏ నర్సింలు పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్ కుమార్ వయోజన విద్య జిల్లా ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ బాబు డీపీఏం నర్సింలు కొమరయ్య శేఖర్ నర్సింలు జిల్లా మహిళా సమైఖ్య అధ్యక్షురాలు జానకీ కార్యదర్శి శ్వేత కోశాధికారి భాగ్యలక్ష్మి లతో పాటు స్నేహ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Next Story