- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏడాదికి పైగా రాష్ట్రంలో “నెంబర్ వన్” స్థానంలో నిలవడం తన టీమ్ కృషి : ఫ్యూచర్ సిటీ సీపీ సుధీర్ బాబు
రాష్ట్రంలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు “నెంబర్ వన్” స్థానంలో నిలవడంలో తన టీమ్ కృషి అని ఫ్యూచర్ సిటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ జి. సుధీర్ బాబు అన్నారు.

దిశ, ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు “నెంబర్ వన్” స్థానంలో నిలవడంలో తన టీమ్ కృషి అని ఫ్యూచర్ సిటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ జి. సుధీర్ బాబు అన్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం మూడో బెటాలియన్ వద్ద బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆయన వీడ్కోలు సమావేశంలో అయన పదవీ విరమణ పొందారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. సుదీర్ఘ సేవా కాలంలో తన కర్తవ్య నిబద్ధత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన సుధీర్ బాబు, ఫ్యూచర్ సిటీ పోలీస్ వ్యవస్థను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు.
“ఒక్క వ్యక్తి వల్ల కాదు.. మనందరి కలిసి కట్టుగా చేసిన పని వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయి” అంటూ సిబ్బందిని కొనియాడారు. ప్రతి పోలీసు సిబ్బంది కష్టాన్ని గుర్తు చేసుకుంటూ, వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తన సేవా ప్రయాణంలోని ఎన్నో మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సుధీర్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. సహచరులతో గడిపిన క్షణాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు, ఒక్కసారిగా గుర్తుకొచ్చి కంటతడి పెట్టారు. ఈ సందర్బంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. సుధీర్ బాబు నాయకత్వంలో పని చేయడం తమకు గౌరవంగా భావించమని తెలిపారు. ఆయన చూపిన మార్గదర్శకత్వం భవిష్యత్తులో కూడా పోలీస్ విభాగానికి ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. క్రమశిక్షణ, సేవా స్పూర్తి, ప్రజల భద్రతపై అంకితభావంతో సాగిన సుధీర్ బాబు సేవా ప్రయాణం నేటితో ముగిసినా, ఆయన ముద్ర మాత్రం పోలీస్ శాఖలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సిబ్బంది పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యూచర్ సిటీ జాయింట్ సీపీ చందనా దీప్తి, ఇబ్రహీంపట్నం 3వ బేటాలియన్ కమాండెంట్ జమీల్ భాష, మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, షాద్ నగర్ డీసీపీ శిరీష, ట్రాఫిక్ డీసీపీ శివమ్ ఉపాధ్యాయ, అదనపు డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవి రాజు, ఏసీపీ హుస్సేన్ నాయుడు పాల్గొన్నారు.






