- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

ఎక్కడ పోటీ చేస్తే గెలుస్తాం.. ?
- రిజర్వేషన్ల ప్రకటనతో అనుకూల స్థానాల కోసం అభ్యర్థుల గాలింపు..
- విజయావకాశాలపై ఆశావహుల వ్యూహాలు
- శంకర్‌పల్లి మున్సిపల్‌లో మొదలైన ఎన్నికల హడావిడి
దిశ, శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో 15 వార్డులకు గాను రిజర్వేషన్లు అధికారులు వెల్లడించారు. అయితే రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారిలో ఆశలు చిగురించగా.. వ్యతిరేకంగా వచ్చినవారు నిరాశతో భవిష్యత్తు వ్యూహం కోసం సిద్ధమవుతున్నారు. ఏ వార్డులో తమకు అనుకూలమైన రిజర్వేషన్ వచ్చింది ? ఎక్కడ పోటీ చేయాలి? ఎక్కడ పోటీ చేస్తే తమ విజయం ఖాయం? అనే లెక్కలు వేయడంలో నిమగ్నమయ్యారు.
మొదలైన ఎన్నికల వేడి..
సర్పంచ్ ఎన్నికలు పూర్తయి, గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఏర్పాటు కావడం.. తదనంతరం మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించడంతో మరో మారు ఎన్నికల వేడి కనిపిస్తోంది. పార్టీపరంగా జరిగే మున్సిపల్ వార్డు ఎన్నికలలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ తరుఫున పోటీ చేసేందుకు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కాగా.. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితాను సిద్ధం చేయడంతో పాటు పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో 15 వార్డులు ఉండగా 21,401 మంది ఓటర్లు ఉన్నట్టు తేలింది. ఇందులో 10, 850 మంది మహిళలు, 10, 551 మంది పురుషులు ఉన్నారు.
రిజర్వేషన్లు ప్రకటనతో ముమ్మర ప్రయత్నాలు
శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో 15 వార్డులకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించడంతో పాటు చైర్మన్ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించడంతో పోటీ రసవత్తరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో జనరల్ మహిళకు కేటాయించడంతో ఈసారి జనరల్ స్థానానికి రిజర్వు చేశారు. వార్డు మెంబర్ గా ఎన్నికైన అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చైర్మన్ పీఠాన్ని అధిరోహించడానికి మూడు ప్రధాన పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి.






