రేషన్ బియ్యం దొంగలెవరు?

by velandi.Saikiran |

పేదోడి కడుపు నింపే రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని దళారులు లబ్ధిదారుల వద్ద

రేషన్ బియ్యం దొంగలెవరు?
X

దిశ, షాద్ నగర్: పేదోడి కడుపు నింపే రేషన్‌ బియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని దళారులు లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం పేదల కడుపు నింపేందుకు రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. అయితే, కొంద రు దళారులు దీన్ని ఆసరాగా తీసుకొని షాద్ నగర్ నుంచి ఇతర ప్రాంతాలకు దాటిస్తూ రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. ఈ క్రమంలో రేషన్‌ కార్డుదారుల నుంచి దళారులు కిలో బియ్యం రూ. 15, రూ. 20కి కొనుగోలు చేసి మాఫియాగా మారి రూ. 30కి విక్రయిస్తూ ధనార్జన కు పాల్పడుతున్నారు.

ప్రతి పేద కుటుంబం మూడు పూటలా కడుపునిండా తినాలని తెలంగాణ సర్కార్ అందిస్తున్న ఆహార భద్రత పథకం లక్ష్యం నీరుగారుతోంది. కుటుంబంలో ఒకరికి 6 కిలోల చొప్పున కుటుంబం మొత్తానికి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తుంది. పేద లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యం, అయితే ప్రభుత్వ ఆశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ రూ. లక్షలు ఆర్జిస్తున్నారు. ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో లారీలు, మినీ వ్యాన్లు, ఆటో ట్రాలీల్లో ఇతర ప్రాంతాలకు రహస్యంగా తరలిస్తున్నారు.

షాద్ నగర్ లో పీడీఎస్ బియ్యం పట్టివేత!

నియోజకవర్గంలో 2 వాహనాల్లో తరలిస్తున్న సుమారు 10 క్వింటాళ్ల బియ్యం సోమవారం పట్టుబడినట్లు సమాచారం. కేసు నమోదు చేసి వాహనాలను పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు విశ్వసనీయంగా తెలిసిం ది. పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. షాద్ నగర్ ప్రాంతం నుం చి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వాహనాలలో భార్యాభర్తలు వ చ్చి గ్రామాల్లో తిరిగి బియ్యం కొంటున్నారు. కొనుగోలు చేసిన ఈ బి య్యం ఎవరికి అమ్ముతున్నారు.? ఆ తర్వాత బియ్యం ఎక్కడికి తరలుతుంది? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరనన్నది? స్థానిక ప్రజలను తొలుస్తున్న ప్రశ్న. ఏది ఏమైనా ప్రభుత్వాలు మారినా అక్రమార్కుల పద్ధతి మాత్రం మారడం లేదని. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story