- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లెగసీ’ అక్రమాలకు.. జీహుజూర్!
ఊరంతా.. ఒకదారి అయితే ఉలిపిరి పిట్టది మ రోదారి అన్న సామెత గౌరెల్లిలోని ‘లెగసీ ఏఎమ్మార్’ రియల్ సంస్థ విషయంలో రెవెన్యూ

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: ఊరంతా.. ఒకదారి అయితే ఉలిపిరి పిట్టది మ రోదారి అన్న సామెత గౌరెల్లిలోని ‘లెగసీ ఏఎమ్మార్’ రియల్ సంస్థ విషయంలో రెవెన్యూ అధికారుల కు సరిగ్గా నప్పుతుంది. ప్రభుత్వ రో డ్డునే రియల్ సంస్థ వాడుకుంటోందని గ్రామస్తులు గొంతు చించుకొని అరుస్తున్నా.. అధికారులు మా త్రం అడ్డంగా తల ఊపుతున్నారు. ఈ రోడ్డు విషంయలో విచారణకు వెళ్లిన ఆర్‌ఐ రాంబాబు పంచాయతీలో ఎటువంటి తీర్మానం చేయలేదని, ఎటువంటి నిధులు వెచ్చించలేదని తాజా మాజీ సర్పంచ్ తో పాటు.. ఇన్ చార్జి పంచాయతీ కా ర్యదర్శిలు ఆర్‌ఐ మాటలను ఖండిస్తుండగా.. ఆర్‌అండ్‌బీ శాఖ.. పం చాయతీ నిధులతో రోడ్డు వేసిందం టూ ఆర్‌ఐ చెబుతుండడం ఆశ్చర్యా నికి గురిచేస్తోంది. మొదటి నుంచీ సంస్థ అక్రమాలకు వంతపాడుతూ వస్తున్న అధికారులు.. వాటిని పక్క న పెట్టి అనుకూలంగా నివేదిక ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
వంతపాడుతున్నఅధికారులు
సంస్థ కస్టమర్లకు చూపెడుతున్న రెండో దారిపై ఆనేక ఆరోపణలున్నాయి. ఈ దారిని గతంలో సొంత భూమి అని రియల్ సంస్థ చెప్పిన ట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రోడ్డు కూడా ప్రభుత్వ స్థలంలో వే సిందే. ప్రస్తుతం లెగసీ రియల్ సం స్థ వాడుకుంటున్నది కూడా ఈ రోడ్డే. విల్లాల దారి ఇదేనని కస్టమర్లను నమ్మిస్తోంది. దీనిపై కొన్ని ప్ర జావాణిలలో స్థానికులు అనేక సార్లు ఫిర్యాదు చేశారు. నేటికీ రెవె న్యూ అధికారులు సదరు సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీ నిపై ‘దిశ’లో 16న ‘విల్లాలకు స ర్కారీ దారి!.’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ మేరకు ఆర్‌ఐ రాం బాబు గురువారం సాయంత్రం విల్లాలు నిర్మిస్తున్న ప్రాంతాన్ని సం దర్శించారు. విచారణ గురించి ‘దిశ’ అడగగా.. అది ఆర్‌అండ్‌బీ వేసిన రోడ్డు అంటూ ఆర్‌ఐ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని మాజీ సర్పంచ్ మల్లేష్, ఇన్‌చార్జి పంచా యతీ కార్యదర్శి శశిధర్ దృష్టికి తీసుకెళ్లగా.. వారు ఆర్‌ఐ మాటల ను ఖండించారు. తారామతిపేట్, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తిమ్మాజీపే ట్ తదితర గ్రామాల ప్రజలు ఔటర్ నుంచి రాకపోకలు సాగించేందు కు.. నాగోల్, హయత్ నగర్ తదిత ర ప్రాంతాలకు వెళ్లేందుకు కనెక్టివిటీగా ఉందని ఈ రోడ్డు మార్గాన్ని వాడుకుంటున్నారు. ఈ రోడ్డు కా కుండా ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు విశాలమై న డబుల్ రోడ్లు ఉన్నాయి. పోనీ.. ఆర్‌ఐ చెబుతున్నట్లు ఆర్‌అండ్‌బీ శాఖనే వేసిందని అనుకుంటే.. వెం చర్ లోపలి నుంచి ఎందుకు వేసిన ట్లు?. అన్నది ప్రశ్నార్థకమే. రియల్ సంస్థ ఒత్తిళ్లకు తలొగ్గే ఇలా మాట్లాడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఆ రోడ్డు కాకపోతే.. ఈ రోడ్డు..
‘లెగసీ ఏఎమ్మార్’ సంస్థ మొదటి నుంచీ నిబంధనలను అతిక్రమి స్తూనే ఉందన్న ఆరోపణలున్నా యి. లే అవుట్ అనుమతుల సమ యంలో హుడా వద్ద ఒక మ్యాపు, మున్సిపాలిటీలో మరో మ్యాపును ఇచ్చారని, అలాగే కస్టమర్లకు సైతం రెండు, మూడు రకాల బ్రో చర్లను చూపెడుతోందన్న విమర్శలున్నాయి. వెంచర్‌కు అనుమతు లు పొందిన రోడ్డు ఒకటైతే.. మరో రోడ్డు చూపించి కస్టమర్లను మభ్యపెట్టింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోక తప్పలేదు. ప్రభు త్వ భూమిలోనే వేసిన ఆ రోడ్డును అధికారులు మూసివేశారు. దీం తో లెగసీ పక్కనే ప్రభుత్వ భూమి లోని మరో రోడ్డును చూపించి విల్లాలను అమ్ముకుంటోంది.
వెంచర్ వాళ్లు వేసుకున్నదే..
‘లెగసీ ఏఎమ్మార్’ కస్టమర్లకు చూపెడుతు న్న రెండో రోడ్డు ప్రభుత్వ భూమిలో వేసిం దే. అదే రోడ్డును ‘లెగసీ’ వాడుకుంటోంది. రోడ్డును అధికారులు మూసివేస్తే.. విల్లాల కు వెళ్లేందుకు దారి ఉండదు. ఆర్‌ఐ చెబుతున్నట్లు ఆర్‌అండ్‌బీ వేసింది అయితే ప్రొసీ డింగ్స్ చూపించాలి
-మల్లేష్, మాజీ సర్పంచ్
రోడ్డుకు ఎటువంటి తీర్మానం లేదు
ఆ రోడ్డు ఆర్‌అండ్‌బీ శాఖ వేసింది కాదు.. వెంచర్ కోసం గతంలో వేసుకున్నారు. నేను ఇక్కడ పని చేసేందుకు ముందే రోడ్డు వేసుకున్నారు. రోడ్డుపై గౌరెల్లి పంచాయతీలో తీ ర్మాణాలు లేవు. ఎటువంటి నిధుల కేటాయింపులు కూడా జరగలేదు.
-శశిధర్, ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి
ఆర్‌అండ్‌బీ శాఖ వేసిందే
ముమ్మాటికీ ఆ రోడ్డు ఆర్‌అండ్‌బీ శాఖ వే సిందే. కుత్బుల్లాపూర్-తిమ్మాజీపేటకు కనెక్టివిటీ కోసం రోడ్డు వేశారు. విచారణకు వెళ్తే అంతా ఇదే చెబుతున్నారు. తహశీల్దార్ దీనిపై నివేదిక అడిగారు. రిపోర్టు తయారు చేశాక పూర్తి వివరాలు చెబుతా.
-రాంబాబు, ఆర్‌ఐ






